

బిఅర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి
జనం న్యూస్, ఆగస్టు 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారని మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకూరి మధుసూదన్ రెడ్డి అన్నారు, శనివారం గజ్వేల్ మండలం లోని రిమ్మన గుడ రహదారిపై రైల్వే రేక్ పాయింట్ పునరుద్ధరించి రైతుల కొరత లేకుండా యూరియా సరఫరా చేయాలని డిమాండ్. చేస్తూ రైతులకు మద్దతుగా రాస్తారోకో చేపట్టిన గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు
ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి దిగ్బంధం ధర్నా కు జగదేవపూర్ మండలం నుంచి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నాడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చిలుకూరి మధుసూదన్ రెడ్డి, మాట్లాడుతూ రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్న కాంగ్రెస్ బిజెపి లకు రైతుల ఉసురు తగులుతుందని వాక్యాన్నిoచారు,యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు,బిఆర్ఎస్ పార్టీ పాలనలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు, వచ్చే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్,బిజెపి లకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు,ఈ ర్యక్రమంలో మండల మాజీ కో అప్షన్ ఎక్బాల్,ఇటిక్యాల గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, జగదేవపూర్ గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగరాజు,నాయకులు సత్యం,శ్రీను,బాలు,జహంగీర్,మహేష్,కనకయ్య,తదితరులు పాల్గొన్నారు.

