Listen to this article

శ్రీ పశుపతినాథ్ దేవస్థానం వల్లభాపురంలో.

జనం న్యూస్ 16 ఆగస్ట్ 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్).

ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవస్థానం శివాలయంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ, శివాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా శనివారం ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణ భగవాన్ వారి ప్రతిమను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథంలోని శ్లోకాలను వచనాలను ప్రతి ఒక్కరికి సరళమైన భాషలో అర్థం అయ్యే విధానం గా రూపొందించడం జరిగింది అని అన్నారు. దైవ జ్ఞాన విశేషాల్లో భాగంగా దేవాలయం సంప్రదాయాల్లో ఆత్మజ్ఞానం, తెలుగు పండుగల విశిష్టత, మరియు తెలుగు నెలల విశిష్టత, త్రైత సిద్ధాంత భగవద్గీత శ్లోకముల సారముతో పాటు ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నాయని ప్రజలందరూ దైవ జ్ఞానం గ్రంథాలను చదివి ఆచరణలో తెచ్చుకొని దైవ సన్నిధి మోక్షం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్దాంతం ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి సభ్యులు శివ నారాయణ సింగ్, వెంకటేష్, రాకేష్, కీర్తన్, సాకేత్, రేవతి కల్పన రాణి, శ్రీలత,స్రవంతి, తనుషా, దివిజ, క్షేత్రజ్ఞ, మోక్షజ్ఞ, ఋషి, భవిజ్ఞ, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.