Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )

మునగాల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక చెరువు గట్టు శివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రజకుల కుల దైవం శ్రీ సీతాలమ్మ సమేత మడేలయ్య స్వామి నూతన దేవాలయ ప్రారంభోత్సవ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి.నూతన దేవాలయం నందు ఆగస్టు 18న సోమవారం ప్రతిష్టించనున్న సీతాలమ్మ, మడేలయ్యా ,పోతురాజుల విగ్రహాలను శనివారం స్థానిక శివాలయం నందు ప్రత్యేక ట్రాక్టర్ పైకి ఎక్కించి మునగాల గ్రామంలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు, ఈసందర్భంగా గ్రామంలోని రజక ఆడపడుచులు తమ ఇంటి ముందుకు వచ్చిన స్వామి వారి విగ్రహాలకు నీళ్లు ఆరబోసి ,పసుపు కుంకుమల పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ముక్కోళ్ల వెంకటేశ్వరరావు, దేవాలయ కమిటీ అధ్యక్షులు తంగెళ్ల నాగేశ్వరరావు , దేవాలయ కమిటీకార్యవర్గ సభ్యులు,మరియు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.