Listen to this article
  • ఆదివాసీ రైతుల జోలికొస్తే ఊరుకోం ఖబడ్దార్ *-
  • రైతు కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి

జనం న్యూస్ జనవరి 27 కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతులకు జరిగిన అన్యాయాన్ని ఉద్దేశించి భూ నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేసి అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ తిర్యాని మండలం మంగి గ్రామ శివారు ఎర్రబండ గ్రామమునకు చెందిన గిరిజన రైతులు 40 సం ల నుండి ఖాస్తు కబ్జా లో ఉన్న భూములను సాగు చేయుచున్నారు అట్టి భూములకు రెవిన్యూ అధికారులు పట్టా మంజూరు చేసి ఉన్నారు అట్టి భూమికి నేడు తహసీల్దార్ వచ్చి రద్దు చేసినామనీ అంటున్నారు. గ్రామము ఎర్రబండ మండలం తిర్యాణి తాత లు తండ్రుల నుండిసాగుచేయుచున్న భూములకు రెవిన్యూ అధికారులు పట్టా మంజూరు చేసినారు అట్టి భూములను నేటి వరకు సాగుచేయుచున్న. వీరికి బ్యాంకు నందు ఋణము తీసుకున్నారు. రెవిన్యూ అధికారులు ఆన్ లైన్ నుంచి భూముల రికార్డు తొలగించుట వలన నేడు వీరికి పహాణి 1బి కూడా రావటము లేదు దానికి బ్యాంకు అధికారులు రైతుల భూములు జప్తు చేస్తాము అని నోటీసులు పంపుచున్నారు. వీరు భూమిపై ఆధారపడి జీవిస్తున్నారు నాడు పెద్దలు భూమి పొంది సాగు చేయుచుండెను రెవిన్యూ అధికారుల నిర్లక్షము వలన వీరి భూములను ఆన్ లైన్ నుంచి తొలగించినారు. వీరికి తెలంగాణ పట్టా ప్రభుత్వం మంజూరు చేసిన అట్టి పట్టాలు రద్దు అయినవి సమస్య పరిష్కరించకుండా ఫారెస్ట్ భూములు మాకు సంబంధం లేదు అంటూ తహసిల్దార్ తిర్యాణి గారు చెప్పుచున్నందున రికార్డు ప్రకారము వీరి భూములకు ఆన్ లైన్ చేసి పట్టా కొనసాగుటకు మరియు రైతు బందు, రుణమాఫీ అమలు చేయుటకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పలుమార్లు విన్నపము చేసినారు మరియు ప్రజాపాలన, జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నవించుకున్నా వీరికి తగు న్యాయం జరగలేదు.కావున వీరికి సాగుచేయుచు భూమి పొందిన వారికి ఆన్ లైన్ చేసి పట్టా, రైతు బందు,రుణమాఫీ పునరుద్దరించగలరని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత రైతులు, కినక జన్గు, మరుసకొల బోజీ రావ్ గ్రామ పటేల్, ఆత్రం ఆత్మరావ్, కొర్వేత దేవ్, సోయం చిత్రూ, కినక మాంకు ఇతరులు పాల్గొన్నారు.