Listen to this article

మద్నూర్ ఆగస్టు 18 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తడ్గుర్ వద్ద ఉన్న వంతెన పై నుండి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో పెద్ద తడ్గుర్ జుక్కల్ మధ్య ఉన్న రోడ్డు మూసి వేశారు మరియు అంతాపూర్ సోమూర్ మధ్య వంతెన పై నుండి వరద నీరు ప్రవాహముతో అంతాపూర్ సోమూరు మధ్య ఉన్న రోడ్డు మూసి వేసినారు మరియు లేండి వాగు వరద ఉధృతంగా పారుతుంది వంతెన పైనుండి పారడంతో గొజ్జగావ్ సోనాల గ్రామాల మధ్య రాకపోకలను బందు చేశారు రెండు వైపులా ట్రాక్టర్లను అడ్డంగా పెట్టామని మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు . వరద ప్రవాహాన్ని పరిశీలించిన తాసిల్దార్ తో పాటు మండల ఎంపీడీఓ రాణి ,ఎస్సై విజయ్ కొండ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.