Listen to this article

ప్రజాస్వామ్యం ఒక భ్రమ-లేదా ఒక వాస్తవమా ?ప్రజలు,నాయకుల మధ్య పెరుగుతున్న అగాధంపై సమగ్ర నివేదిక

(జనం న్యూస్18 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి )

ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ప్రభుత్వం అని అబ్రహం లింకన్ నిర్వచించారు కానీ నేటి రాజకీయ వాతావరణం చూస్తుంటే ఈ నిర్వచనం ప్రశ్నార్థకంగా మారుతుంది.రాజకీయ యకులు,పార్టీలు, కార్యకర్తల మధ్య ఉన్న సంబంధాలు, ప్రజల పాత్ర ఈ మూడు అంశాలు ప్రజాస్వామ్య స్వభావాన్ని నిర్ణయిస్తున్నాయి.ఎన్నికల అప్పుడు ప్రజల చుట్టూ తిరిగే నాయకులు,ఆ తర్వాత ప్రజలకు దూరంగా వెళ్లిపోవడం అనేది ఒక సాధారణ దృశ్యంగా మారింది.ఈ పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల పాత్రను,నాయకుల బాధ్యతలను పున సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది ఎన్నికల ఉత్సాహం-తర్వాత అయిదేళ్ల నిశ్శబ్దం ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ప్రజల మధ్యకు వస్తారు, వాళ్ల కష్టాలు వింటారు,పరిష్కారాలు చూపిస్తామని వాగ్దానాలు చేస్తారు,ఉచిత హామీలు,పథకాలు,ఒక్కోసారి బిర్యానీ ప్యాకెట్లు,మద్యం ప్యాకెట్లు వంటివి పంపిణీ చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు,దీనికి అలవాటు పడిన ప్రజలు కూడా కొన్నిసార్లు తాత్కాలిక లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.కానీ,ఎన్నికల తర్వాత నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఇచ్చిన హామీలు మర్చిపోవడం ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వంటివి చాలా సర్వసాధారణం ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ప్రధాన లోపం.ఎన్నికలు ఒక పండుగలా ప్రారంభమై అయిదేళ్లు పాటు ప్రజలకి నాయకులకి మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది. కార్యకర్తల త్యాగాలు-నాయకుల ప్రయోజనాలు రాజకీయ పార్టీలలో కార్యకర్తలే వెన్నుముక.పార్టీ కోసం కష్టపడటం, ప్రచారం చేయడం,ఎన్నికల్లో నాయకుడి కోసం గెలుపుకు కృషి చేయడం వాళ్ల ప్రధాన బాధ్యత అయితే పార్టీల మధ్య ఘర్షణలు వచ్చినప్పుడు తన్నుకోవడం, చివరికి జైలు పాలవడం లేదా ప్రాణాలు కోల్పోవడం వంటివి చూస్తుంటాం ఈ ఘర్షణల్లో నాయకుల కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి,వాళ్ళ పిల్లలు కూడా ఈ గొడవల్లో పాల్గొనరు.కానీ, సామాన్య కార్యకర్తలే ఇబ్బందులు పడతారు.ఈ విషయం కార్యకర్తలు, ప్రజలు గమనించాలి.నాయకులు,ఇతర పార్టీల నాయకులతో వ్యక్తిగత స్థాయిలో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. కానీ,కార్యకర్తలు మాత్రం మా పార్టీ,మీ పార్టీ, అంటూ బేధాలు పెట్టుకొని, అనవసరమైన వైషకమ్యాలకు గురవుతారు.ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర- కేవలం ఓటు వేయడమా ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు.నాయకుడు అనే వాడు ప్రజలకు సేవకుడు మాత్రమే.కానీ ప్రస్తుతం ప్రజలు నాయకులను ప్రశ్నించే హక్కును విస్మరిస్తున్నారు.తమ ఓటుతో గెలిచిన నాయకుడిని,వారి పనులను నిలదీయాలి.నాయకులు చేస్తున్న అభివృద్ధి పనులు,ఇచ్చిన హామీలు నెరవెర్చారా లేదా అనేది గమనించి, వాళ్లని ప్రశ్నించాలి ఒకవేళ నాయకులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోతే ప్రజలు వాళ్లని ఎన్నికల్లో ఓడించే హక్కు ఉంది మన ఓటుతో గెలిచిన నాయకుడిని మనం ప్రశ్నించలేకపోతే,ఆ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు.కొత్తగా ఎన్నికైన నాయకులు గాని,పాత నాయకులు గానీ,వాళ్లు మన ప్రాంతానికి,మన రాష్ట్రానికి,మన దేశానికి ఏమి చేశారో ప్రజలు తెలుసుకోవాలి. వాళ్లు చేయబోయే పనులు ఏమిటో గమనించి చెయ్యకపోతే ప్రశ్నించాలి. నాయకులు కేవలం ప్రజల ఓట్ల కోసం మనల్ని పావులగా వాడుకుంటున్నారు. వాళ్లు మన పేరు చెప్పుకొని,మన ఓట్లతో అధికారాన్ని పొంది,ఐదేళ్ల పాటు మనపై పెత్తనం చేస్తారు.ఈ వాస్తవాన్ని ప్రజలు, కార్యకర్తలు గ్రహించాలి.రాజకీయ నాయకుల కోసం మనం జిందాబాద్ కొట్టడం కాదు,మనకోసం,మనం భవిష్యత్తు కోసం,మన హక్కుల కోసం నిలబడాలి.ఏ నాయకుడు కూడా మన కోసం త్యాగం చేయడు మన ఓటు మన ఆయుధం అది మన హక్కు.దాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. నాయకులు సరిగ్గా పనిచేయకపోతే వాళ్లని పక్కన పెట్టి,మంచి వాళ్లను ఎన్నుకోవాలి.అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది లేకపోతే నాయకులు మనల్ని ఒక పావులాగా వాడుకుంటూనే ఉంటారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే