Listen to this article

పాపన్నపేట, ఆగస్ట్. 18 (జనంన్యూస్) :

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం నార్సింగి గ్రామం లోని ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహన్ని మండల గౌడ సంఘం సభ్యులు విష్కరించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి సమాజానికి ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. విగ్రహ దాత పిరంగి లావణ్య నారాయణ గౌడ్ ను శాలువాతో సంఘం సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించారు.