

జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వెంకటేశ్వర్ నగర్ 35 బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గం సభ్యులందరూ కలిసి కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ని మర్యాద పూర్వకంగా వారి నివాసంలో కలవడం జరిగింది. కార్పొరేటర్ రోజా దేవి రంగారావు సలహాదారులైనటువంటి రాములు సాగర్, రామ్ సాగర్, నర్సింగ్ రావు, సత్యనారాయణ, అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి అనిల్, మరియు సొసైటీ మెంబర్లు అందరినీ సన్మానం చేసి మీ వెల్ఫేర్ పరిధిలో ఉన్న ప్రజలందరికి మీరు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని మాకు తెలిపినచో మేము వీలైనంత తొందరగా సమస్యలను పరిష్కారం చేసే విధంగా చేస్తామని అన్నారు.