Listen to this article

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు

జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో అసిఫాబాద్: ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు కార్మికులు సమన్వయంతో బస్సు సర్వీస్ లను నడపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అన్నారు. ఆర్టీసీ సంస్థలో టీమ్స్ డ్రైవర్లు సోమవారం విధులు బహిష్కరించడంతో డిసిసి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి డిపో మేనేజర్ విశ్వనాథ్ తో మాట్లాడారు. ఉదయం హైదరాబాదుకు వెళ్లే బస్సులకు కండక్టర్లను సమకూర్చాలని డిఎం కు సూచించారు. డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. సంస్థ అభివృద్ధికి కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. టీమ్స్ డ్రైవర్లకు సర్దిచెప్పి విధులు అక్రమంగా నిర్వహించాలని వారికి సూచించడంతో తమను డిఎం వేధింపులకు గురి చేస్తున్నారని డిసిసి దృష్టికి డ్రైవర్లు తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ బొమ్మన బాలేశ్వర్ గౌడ్, ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు