జనం న్యూస్ ఆగస్టు 18 కాట్రేనికోన
శ్రీమతి&శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల.. పటవల లో 1999-2000 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కళాత్మకంగా నిర్వహించడం జరిగింది… జ్యోతి ప్రజ్వలన గణపతి ప్రార్ధన వందేమాతరం కూచిపూడి గురువులకు సత్కారం పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పరిచయ వేదిక ఆటపాటలతో ఎంతో ఆనందంగా జరిగింది చి,, సంస్కృతి చేసిన నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అజయ్ వర్మ సభా వేదికను నడిపిస్తూ గురువులకు స్వాగతం పలుకగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు మందాల వీరభద్రరావు, సత్యనారాయణ, శివ సత్యనారాయణ లను పూర్వ విద్యార్థులందరూ పాద పూజ చేసి సత్కరించుకున్న తీరు గురువులు పట్ల విద్యార్థులకు విద్యార్థుల పట్ల గురువులకు ఉండే బంధాన్ని ఆప్యాయతను పెంపొందిస్తూ మరింత శోభన తీసుకొచ్చింది నాకు ఇది పునర్జన్మ అని శ్రీను చెప్పగా మిత్రులందరూ భావోద్వేగానికి గురయ్యారు… ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన మిత్ర బృందం తాను చదువుకున్న పాఠశాలలో 25 వసంతాల తర్వాత కలుసుకోవడంతో అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన్మయత్వానికి గురయ్యారు… స్వర్గస్తులైన గురువులకు, విద్యార్థులకు మౌనం పాటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఆశీస్సులు అందించిన గురువులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ నారాయణ, చైర్మన్ శివప్రసాద్, చి,,సంస్కృతికి, విజయవంతం చేయడానికి కృషి చేసిన మిత్రులందరికీ.. తనపై నమ్మకం కలిగిన మిత్రులకు అజయ్ వర్మ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు



