Listen to this article

జనం న్యూస్, ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి

పి.గన్నవరం నియోజవర్గం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం ఉమామహేశ్వర ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్ పర్సన్ గా నల్లా శ్రీను బాధ్యతలు స్వీకరించారు. మిద్దె నూతన రవిరాజ్, సరెళ్ళ రాజ్ కుమార్ పర్సన్ లుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని బీజేపీ అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ పి.గన్నవరం అసెంబ్లీ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, అంబాజీపేట మార్కెటింగ్ డైరెక్టర్లు మోర్త సత్తిబాబు, కుడుపూడి చంద్రశేఖర్ సత్యవేణి, బీజేపీ నేతలు మొగలి దుర్గారావు, నల్లా సత్తిబాబు శాలువా వేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చీకురుమెల్లి మాట్లాడుతూ ఎన్డీయే కూటమి లో నిబద్ధతతో పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిద్దె పట్టాభి, పెచ్చెట్టి మల్లికార్జునరావు, మట్టపర్తి సత్యనారాయణ, నల్లా నాగబాబు, నల్లా గణేష్, కడలి పెద్ద, మోర్త భరత్, ములికి మూర్తి, మల్లాది మల్లిబాబు మాస్టారు, విఘ్నం, యర్రంశెట్టి శ్రీను, శీలం కిట్టయ్య, నల్లా పల్లంరాజు మరియు పలువురు కూటమి నేతలు, జనసేన యువత పాల్గొన్నారు.