Listen to this article

:జనం న్యూస్ ఆగస్టు 19

చిలిపిచేడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చిట్కుల్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి శ్రీ విఠల్ సందర్శించి విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలోనే విద్యార్థుల అభ్యసనకు గట్టి పునాది పడాలని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ, బోధనలో సుదీర్ఘ అనుభవం కలిగిన చిట్కుల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామ చంద్రా రెడ్డి గారిని అభినందించారు. ఇందులో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నాగరాజు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నాగేందర్ రెడ్డి, సత్యనారాయణ, అనిత, సి ఆర్ పి మల్లేశం పాల్గొన్నారు