Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో కానిస్టేబుళ్ళ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై, సివిల్, ఎపిఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ నెల 20న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 8గంటలకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆగస్టు 18న ఒక ప్రకటనలో కోరారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో సెలక్షన్స్ ప్రక్రియకు హాజరై, ఎపిఎస్పీ, సివిల్ విభాగాల్లో ఎస్.సి.టి.పి.సి.లుగా తుది రాత పరీక్షలో ఎంపికైన పురుష, మహిళా అభ్యర్ధులు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఈ నెల 20న ఉదయం 8గంటలకు హాజరుకావాలన్నారు. అభ్యర్ధులు సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషనుతో జతపర్చిన ధృవ పత్రాల ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను, గెజిటెడ్ అధికారితో అటెస్టేషను చేయించిన మూడు సెట్ల జెరాక్స్ కాపీలను, మూడు పాస్పోర్టు సైజ్ కలర్ ఫోటోలను తీసుకొని రావాలన్నారు. జిల్లాలో నిర్వహించిన సెలక్షన్ ప్రక్రియకు హాజరైన అభ్యర్థుల్లో 723మంది అభ్యర్థులు వివిధ జిల్లాల్లో సివిల్, ఎపిఎస్పీ బెటాలియన్స్ ఎస్.సి.టి.పోలీసు కానిస్టేబుళ్ళుగా ఎంపికయ్యారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే ఈ నంబర్లను సంప్రదించవచ్చు 94914 72314 9440435603.