జనంన్యూస్. 19. సిరికొండ.ప్రతినిధి.
సిరికొండ ఎస్ఐ ఆధ్వర్యంలో సిరికొండ మండల పరిధిలో గల అన్ని గ్రామాల గణేష్ మండపాల ఆర్గనైజర్స్ సుమారు 200 మంది తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో చేయవలసినవి మరియు చేయకూడనివి (Does & Don’ts) వాళ్లకు సూచన చేయడం జరిగింది . ప్రతీ సంవత్సరం అందాజ 160 విగ్రహాలు పెట్టడం జరుగుతుంది కావున ఈ 160 విగ్రహాలు కూడా ఆన్లైన్ చేయాలి అని సూచించారు పోలీసు వారు సూచించిన సూచనలు వినాయకుని పెట్టుకునే క్రమంలో కంపల్సరిగా ఆన్లైన్ చేసుకోవాలి అని సూచించారు ఈ మీటింగ్ లో విగ్రహాలు ఎక్కడ పెడతారో వాటి ఇన్చార్జి కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని అలాగే ఆ విగ్రహాల దగ్గర నైట్ ఎవరైనా ఇద్దరు పడుకోవాలని పవర్(కరెంట్ )కు సంబంధించింది ఎలక్ట్రిసిటీ ఏఈ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని కరెంటు పెట్టుకోవాలని పవర్ కనెక్షన్ పెట్టేటప్పుడు జాగ్రత్త పాటించాలని ఎట్టి పరిస్థితుల్లో డీజే పెట్టుకోకూడదని క్రాకర్స్ అటువంటివి వినాయక మండపాల దగ్గర గాని వినాయక మజ్జనంజరిగేటప్పుడు గానీ పేల్చరాదని వినాయక మండపం దగ్గర మినిమం ఒక సీసీటీవీ పెట్టుకోవాలని వినాయక మండపాల దగ్గర ఏదైనా అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక బకెట్లో ఇసుక మరియు ఒక బకెట్లో వాటర్ పెట్టుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి 10 దాటిన తర్వాత ఎ టువంటి సౌండ్ బాక్స్ లు పెట్టుకొని పాటలు గానీ పెట్టుకోకూడదు వినాయకుని తీసుకొచ్చే క్రమంలో గాని నిమజ్జనం సమయంలో పోయే మార్గంలో గాని ఆ వైర్లు ఎత్తు కిందికి ఉండడం వలన ఆ వైరును పైకి అనే క్రమంలో ఎప్పుడు కూడా ఐరన్ పైపులు వాడరాదని పి వి సి పైపులు వాడాలని వినాయక మండపం రోడ్డుపైన కాకుండా ఏదైనా ఫ్లాట్లో గాని ఏదైనా ఓపెన్ ప్లేస్ లో గాని పెట్టుకోవాలి ఆ వినాయక మండపం ట్రాఫిక్కు అంతరాయం కలవకుండా ఉండాలి ఆ సౌండ్ బాక్స్ లో భక్తి గీతాలు మాత్రమే పెట్టుకోవాలని మండపంలో విగ్రహం కింది భాగంలో ఎటువంటి వస్తువులు గాని పెట్టుకోవద్దని వినాయక నిమజ్జనం సమయంలో ఎవరు కూడా మందు, మిగతా మత్తుకు సంబందీoచినవి త్రాగకూడదని భక్తి శ్రద్ధలతో నిమర్జనం చేయాలని ఊరేగింపు సమయంలో వినాయక విగ్రహం తో పాటు ఎక్కువ మంది ఉండేటట్టు చూసుకోవాలి అని సూచించారు. వినాయక మండపంలలో మట్టి విగ్రహం ప్రతిష్టాపన చేసి అలాగే వినాయక నిమజ్జనం సమయంలో భక్తి భజనలతో మాత్రమే నిమర్జనం చేసిన నలుగురిని గుర్తించి వారికి సన్మానం చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది.



