Listen to this article

కూటమి ప్రభుత్వం ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం సంతోషకరమే కానీ తద్వారా ఉపాధి కోల్పోతున్న వేలాదిమంది ఆటో కార్మికుల సంఘం ఆటో వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఎన్ శివ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిగ్రీలు చదివిన ఉపాధి లేక అనేకమంది నిరుద్యోగ యువత ఆటో కార్మికులుగా మిగిలిపోయారని నేడు ఈ ఫ్రీ బస్సులు పుణ్యమా అని వేలాదిమంది ఆటో కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందని ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయంగా సహాయ సహకారాలు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బ్యాంకుల ద్వారా ఐదు పర్సెంట్ వడ్డీకి ఆటోలు కొనుగోలుకు రుణాలు ఇప్పిస్తామని చంద్రన్న బీమా ద్వారా పది లక్షల రూపాయలు ప్రమాద భీమా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని సత్వరం డ్రైవర్లకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు జరపాలని లేనిపక్షంలో డ్రైవర్ల అందరూ ఏకతాటిపై రవాణా రంగాన్ని తంబింపజేసి ప్రభుత్వం గద్దె దిగేలా ఉద్యమం చేపడుతామని హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సి సుధాకర్ రెడ్డి ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి టాక్సీ యూనియన్ ఏపీ బాల, ప్రమీలమ్మ, ఏ ఐ టి యు సి నియోజకవర్గ కార్యదర్శి ఇలపా నాగేంద్రబాబు సూళ్లూరుపేట ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు బాబు, మధు, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.