Listen to this article

జనం న్యూస్- ఆగస్టు 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ బాలవిహార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో నోట్ బుక్స్ మరియు పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహారాజుల సంఘం సభ్యులు మాట్లాడుతూ విద్య ఎంతో విలువైనదని, విద్యార్థులు పేదరికంతో చదువుకు దూరం కాకూడదన్న సదుద్దేశంతో తాము ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వెంకన్న, ప్రసాద్ రావు, సతీష్, నరసింహారావు, మహారాజుల సేవా సంఘం అధ్యక్షుడు జి బద్రి, ఉపాధ్యక్షులు కే పుల్లారావు, కార్యదర్శి ఆర్ వీరబాబు, కోశాధికారి కె నకులరావు సభ్యులు దుర్గయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.