జనం న్యూస్ ఆగస్టు 20 వికారాబాద్ జిల్లా.
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి వాగు మంగళవారం కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించింది. మంచన్ పల్లి నుండి పరిగి వెళ్లే వాహనదారులు అటు పరిగి నుంచి వచ్చిన వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జనాలు వాగు తగ్గేవరకు వేచి ఉన్నారు. జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ జలమయమై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు ఆటంకాలు కలిగాయి.


