
జనం న్యూస్ జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఢిల్లీ రిపబ్లిక్ డే పెరట్లో ప్రతిభ చూపిన గజ్వేల్ వాసి. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 76వ రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి ముందు దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలకు సంబంధించిన త్రివిధ దళాలు రాష్ట్రానికి సంబంధించిన కళాకారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యంత ఘనంగా పరేడ్ నిర్వహించడం జరిగింది. అయితే ఈసారి జరిగిన పెరేడ్లో గజ్వేల్ కు చెందిన తమ్మిం జబ్బాన్ అనే 20 ఏళ్ల కుర్రాడు కూడా పాలుపంచుకోవడం జరిగింది.గజ్వేల్ విద్యానగర్ కాలనీకి చెందిన తమ్మిం జబ్బాన్ వాళ్ల నాన్న ప్రముఖ కరాటే శిక్షకుడు జహంగీర్. రాష్ట్రపతి ముందు పరదేశి చేయడం తన జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం అని ఆయన అన్నారు.ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.