జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ప్రపంచ దోమల దినోత్చవం సందర్బంగా నందలూరు మండలం లో డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో లో ర్యాలీ మరియు కాలేజ్ లో ఇంటర్మీ డియట్ పిల్లల కు మీటింగ్ ఏర్పాటు చేసి దోమల వలన వచ్చు వ్యాధుల గురించి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నారాయణ,మరియు సబ్ యూనిట్ ఆఫీసర్, యస్. యస్. దాస్ జువాలేజీ లెక్చరర్ మాట్లాడుతూ, దోమలు చాలా రకాలు ఉన్నాయి కానీ ముఖ్యముగా మన ప్రాంతములో అవి కొన్ని దోమలు ఏడీస్ ఈజీప్ట్ దోమలు మంచి నీటిలో పెరుగుతాయి ఇవి కుట్టడం వలన డెంగీ మరియు చికెన్ గున్య,వ్యాధులు వస్తాయి, ఏనాఫిలిస్ దోమలు కూడామంచి నీటిలో పెరుగతాయి వీటి వలన మలేరియా వ్యాధులు వస్తాయి, అలాగే క్యూ్లెక్స్ దోమలు మురికి నీటిలో పెరుగతాయి వీటి వలన బోధకాలు,మరియు మెదడు వాపు జ్వరాలు వస్తాయి, కావున ప్రజలు అందరు మన ఇంటిలో వాడుకొనే తొట్టి లోనీటిని వారము కు ఒక సారి శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పట్టుకోవాలి,ఇంటి పరిసరాలను శుభ్రము గా ఉంచుకోవాలి,ఇంటి బయట పాత టైర్స్ పాత కుండలు వాడని రోళ్లు లో వర్షం నీరు నిల్వకుండా చూసుకోవాలి, దోమలు కుట్టకుండా రాత్రి లో దోమ తెరలు వాడాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని, దోమ తెరలు వాడాలి అని అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నారాయణ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్,యస్.యస్. దాస్ కాలేజ్ ప్రిన్సిపాల్ హెల్త్ స్టాఫ్ పాల్గొన్నారు


