Listen to this article

తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి అలియాస్  బ్రెడ్ నారాయణ సూళ్లూరుపేట ప్రజలందరికీ కరుడుగట్టిన బిజెపి నాయకుడిగా పరిచయమైన సూళ్లూరుపేట నియోజకవర్గం లోని అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగిన స్నేహశీలి. ప్రస్తుతం సూళ్లూరుపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న నారాయణరెడ్డి గతంలో అనేక దఫాలు అనేక పదవులు వారి సేవా తత్వానికి నిదర్శనంగా నిలిచాయి. పదవులు వ్యక్తికి వన్నె తెచ్చే స్థాయి నుంచి పదవులకే వన్నె తెచ్చే స్థాయికి ఎదిగిన నిరాడంబర వ్యక్తి నారాయణరెడ్డి. 1987 నుండి రాజకీయాలలో ఉన్న నారాయణరెడ్డి బిజెపి పార్టీ సూళ్లూరుపేట అర్బన్ కార్యదర్శిగా, రెండు పర్యాయాలు, అధ్యక్షునిగా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా, జిల్లా అధికార ప్రతినిధిగా రాజకీయ పదవులతో పాటు సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా, సౌత్ జోనల్ రైల్వే బోర్డు మెంబర్గా విశేష సేవలు అందించారు. 2019లో కౌన్సిలర్ గా పోటీ చేసిన నారాయణరెడ్డి వెంట్రుక వాసిలో ఓడిపోయినా ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణలో విశిష్ట పాత్రను పోషించారు. 2024 నుండి ఎన్డీఏ కూటమి సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ మెంబర్గా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గెలుపునకు తనదైన శైలిలో దోహదపడ్డారు. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా నారాయణరెడ్డి నియామకం ఆలయ అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 25వ తారీఖున ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సహకారంతో శ్రీ గంగా పార్వతీ సమేత త్రినేత్ర సంభూతుడైన నాగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.