జనం న్యూస్ 21 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి )
గణేష్ ఉత్సవలను శాంతియుతంగా జరుపుకోవాలని బోధన్ ఏసీపి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణలు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుతంగా జరుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, తహసీల్దార్ తారాబాయి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, మండల నాయకులు, గణేష్ మండపాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


