Listen to this article

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

అత్యవసరమైతే తప్ప ఇండ్లలో నుంచి బయటికి రావద్దు.

వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి.

జనం న్యూస్ 20 ఆగస్టు వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా మోమినిపేట్ మండలం కాసులబాద్ లో నాలుగు రోజుల నుండి భారీగా కురిసిన వర్షాల కు రాకపోకలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతుందని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలోని కాసులబాద్ నంది వాగు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. నందివాగు ప్రాజెక్టు వద్ద చెరువు నీటి మట్టం పెరిగి ప్రవహిస్తున్న నీటి ఉధృతిని మరియు పరిసర ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులతో చర్చించి ప్రజల భద్రత కోసం సూచనలు జారీ చేశారు. చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అవసరం లేనపుడు వెళ్లకూడదు. నీటిమట్టం పెరుగుతున్నందున పిల్లలు, వృద్ధులు చెరువు దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులు మరియు రైతులు రాత్రి వేళల్లో చెరువు దగ్గరఏటువంటి కార్యకలాపాలు చేయకుండా ఉండాలి. చెరువు ప్రమాదకర పరిస్థితులు గమనించినట్లయితే వెంటనే 100 నంబర్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి అని అన్నారు. చెరువు వద్ద క్రమం తప్పకుండా గస్తీ బలగాలు ఉండాలని అవసరమైతే ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో వికారాబాద్ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, జి వెంకట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మోమిన్పేట్ ఎస్సై అరవింద్ సిబ్బంది వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు