జనం న్యూస్ ఆగస్టు 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా
చిలిపిచెడ్ మండల్ లో అకాల వర్షం పడడం వలన మండలంలోని ఆయా గ్రామాల్లో నివాసముంటున్నటువంటి ఇండ్లు కూలిపోయిన వారందరికీ నష్టపరిహారం కట్టిస్తూ ఇందిరమ్మ ఇల్లు వారందరికీ సాంక్షన్ చేయాలని అలాగే జగ్గంపేట్ స్కూల్ బిల్డింగ్ రిపేర్ చేయించాలని మరియు ఆయా గ్రామాల్లో బీటీ రోడ్లు అధ్వానంగా మారినాయి కాబట్టి అట్టి రోడ్లను మరమ్మతులు చేయించాలని ఆయా గ్రామాలలో మురికికాలువలు పిచ్చి మొక్కలతోని దోమలు ఎక్కువ అయినందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ గ్రామంలోనైనా దోమ పిచికారి గాని చేయట్లేదని ప్రతి గ్రామంలో చాలా నెలలకొద్దీ సర్పంచులు లేకపోవడంతోని వీధి బల్బులు సైతం లేక చాలా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి వెంటనే వీటిపై చర్య తీసుకోవాలని ఎం ఆర్ ఓగారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల్ బిజెపి అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ మండల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మండల ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఎస్టి మోర్చా అధ్యక్షుడు బొజ్జ రమేష్ మండల సీనియర్ నాయకులు మధు ఈశ్వర్ దశరథ్ మల్లేశం వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు రాజ గౌడ్ ప్రవీణ్ రాజు యాదవ్ సుభాష్ నాయక్ మల్లేశం బాలు తదితరులు పాల్గొన్నారు


