ఉరి వేసుకొని వ్యక్తి మృతి
జనం న్యూస్, 20 ఆగస్టు 2025, ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కుప్పా నగర్ గ్రామ శివారులోని, వాడుకలో లేని దాబా హోటల్లో ఉరివేసుకొని మంగళవారం మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిసాయి.
మృతుని పేరు మాధవ గిరి, తండ్రి పేరు బాబు గిరి, మృతుని వయసు 34 సంవత్సరాలు, వృత్తి డ్రైవరు. గ్రామం కన్కట్ట, హుమ్నాబాద్ తాలూకా, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి.
మృతుడు ఇస్నాపూర్ లోని, ఎం.ఎస్. ఎన్. కంపెనీలో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు, ఇతను గత ఐదు సంవత్సరాల క్రితం, బసవ కళ్యాణ్ లో రూపాయలు ఐదు లక్షలు అప్పు తీసుకున్నాడని, అప్పు తీర్చడానికి ఇతని వద్ద డబ్బులు లేనందున, అప్పు తీర్చలేక, తన కుటుంబాన్ని పోషించుకోలేక, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, ఇంటికి కూడా వచ్చేవాడు కాదని, వారం, పది రోజులకు ఒకసారి, ఇంటికి వచ్చి వెళ్లే వాడని, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది, ఉరివేసుకొని చనిపోయి ఉండవచ్చని, మృతుని భార్య దండు భాయి, ఝరాసంగం ఎస్సై, క్రాంతి కుమార్ పాటిల్ కు ఫిర్యాదు చేయడంతో, కేసును నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు, ఝరాసంగం ఎస్సై, క్రాంతి కుమార్ పాటిల్ తెలిపారు.


