Listen to this article

జనంన్యూస్. 20. సిరికొండ.

డి.జేలకు ఎలాంటి అనుమతులు లేవు పూర్తిగా నిషేధం

మండపం వద్ద విధ్యుత్ తీగలతో జాగ్రత్తలు పాటించాలి

వర్షం సందర్భంగా మండపంపైన పాల్దిన్ కవర్స వాడాలి

రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలి

  1. గణేష్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుండి డబ్బులను బలవంతంగా వసూలు చేయరాదు. గణేష్ మండపాలను ఎవరికి,ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వవలెను. గణేష్ మండళ్ల వద్ద సందర్శించే మహిళలపై, యువతులపై” ఈవ్ టీజింగ్” జరుగకుండా చూడవలెను. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా డి.జె / డి.జె మిక్సర్స్ / హైఫిడిలిటి ( హైఫై ) సౌండ్స్సిస్టమ్ ఇక్విప్మెంటు విషయంలో చాలా జాగ్రతలు వహించాలి. కొద్ది మంది ఇండ్లలో గుండె జబ్బులు గలవారు, బి.పి గలవారు, వయసు పై బడిన వృద్దులు ఉంటారు. మరియు చదువుకునే విద్యార్థులకు ఆటంకము కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్టి సౌండ్ 12 Decibels దాటి ఉండరాదు. రాత్రి 10-00 గంటలకు ” లౌడ్ స్పీకర్లు” ఆఫ్ చేయాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలి. లేని యెడల చట్టరిత్య చర్యలు తీసుకొనబడును. డి.జే లు పూర్తిగా నిషేదం తీసుకోవాలి. మైక్ పర్మీషన్ కోసం సంబంధిత ఎ.సి.పి ని సంప్రదించి తప్పని సరిగా పర్మిషన్ తీసుకోవాలి. విధ్యుత్ సరఫరా ఆగకుండా వీధి దీపాలు వెలిగేటట్లు చూడవలెను. షార్టు సర్కూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరు ను ఉపయోగించాలి.ప్రజలకు అసౌకర్యం కలుగజేసే ఎటువంటి చిన్న సమాచారాన్ని అయిన మీ దగ్గరలోని పోలీసులకు తెలుపండి. లేదా డయల్ 100 కు ఫోన్ చేయగలరు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 87126- 59700 కు తెలపాగలరు.ప్రతీ గణేష్ మండలి వద్ద ఉదయం వేళలో మరియు రాత్రి వేళలో ఇద్దరూ లేదా ముగ్గురికి తక్కువ కాకుండా తమ కమిటీ మెంబర్ల ను మండలి వద్ద ఉంచవలెను. పోలీస్ వారు చెకింగ్ కు వచ్చినప్పుడు ప్రతీసారి కనబడవలెను. మండపము దగ్గర అసాంఘిక చర్యలు లేకుండా చూసుకోనవలయును. ప్రతి గణేష్ మండలి దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి. పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.” అపరిచిత ” వ్యక్తుల గూర్చి సమాచారం తెలియజేయాలి. మీ దగ్గరలో ఎవ్వరయిన అనుమానస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచూలు వదిలినట్లయితే వాటిని తాకరాదు. అట్టి సమాచారం దగ్గరలోని పోలీస్ అధికారులకు తెలుపండి.
  2. గణేష్ మండలి మొక్క పూర్తి వివరములు నిమజ్జనం కొరకు ఏ రోజు ఎక్కడికి ఏ మార్గం ద్వారా తీసుకు వెళ్తారనే సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే తెలుపండి.గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేయవలెను . ( పై భాగంలో రేకులు, ప్లాస్టిక్ కవర్లతో ఏర్పాటు చేయాలి. వర్షపు నీరులోపలికి రాకుండా ఉండడం కోసం ) గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే వేదిక చాలా బలంగా ఉండేటట్లు చూసుకోవాలి. మేకలు, ఇతర జంతువులు రాకుండా తగు జాగ్రత్తలు తీసికోవాలి.గణేష్ మండలి వద్ద పూజా కార్యాక్రమంలో ” క్యూ ” పద్దతి పాటించాలి. “బారికేడ్లను ” విధిగా ఏర్పాటు చేసుకోవాలి.ప్రత్యేకంగా లైటింగ్ సౌకర్యం కోసం మంచి నాణ్యత గల వైరు తో ప్లాస్టిక్ పి.వి.సి పైప్ ద్వారా లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. పూర్తి సురక్షితమైన కవరుతో ఉన్న ఫడ్లైట్లను మాత్రమే వాడాలి.గణేష్ మండళ్ల వద్ద ఏప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు, రెండు బకెట్ల ఇసుక ఏర్పాటు చేసుకోవాలి, మరియు ఫైర్ బాల్స్ సమకూర్చుకోవాలి.యువకులు కోపతాపాలకు వెళ్లకుండా ” సంయమనం” పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి.ఎటువంటి ” రూమర్స్ (పుకార్ల) ను నమ్మరాదు.
  3. ప్రజలకు అసౌకర్యం కలుగ కుండా నిరంతర పోలీస్ నిఘా ఏర్పాటు చేయబడింది.సంబంధిత నిర్వాహకులు అవసరం నిమిత్తం ఉపయోగించుట కొరకు మీ దగ్గరలోని పోలీస్ సిబ్బంది ఫోన్ నెంబర్లను వ్రాసి పెట్టు కోనగలరు.వీలైనంతవరకు మట్టి మరియు తక్కువ ఎత్తుగల గణపతులను ప్రోత్సాహించండి. పర్యావరణాన్ని కాపాడండి.నిర్వాహాకులు మండపాలదగ్గర వచ్చే భక్తులను “క్యూ”లో నిలబెట్టవలెను. వారి వాహానాలను పద్దతి ప్రకారంగా పార్కింగ్ చేయించవలెను.గణేష్ భక్తులు, నిర్వాహకులు మద్యపానానికి దూరంగ ఉండవలెను.గణేష్ మండళ్ల వద్ద” పేకాట ఆడరాదు.
  4. గణేష్ ఉత్సవాలలో” టపాసుల” నిషేదం గలదు.నిమజ్జనం రోజు పోలీసు వారు జారీ చేసిన నియమ నిబంధనలు పాటిస్తూ విగ్రహాన్ని (రథాన్ని) “క్యూ” లో ఉండే విధంగా చర్యలు తీసుకోగలరు.
  5. ప్రతీ రధనికి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి.నిమజ్జనం రోజు వీలయినంత వరకు చిన్న పిల్లలు ఉండకుండా చూసుకోవాలి.ఎక్కువ జనసమూహం ఉన్నప్పుడు “దొంగతనాలకు ఆస్కారము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిల్లర దొంగల పై జాగ్రత్త వహించాలి.నిమజ్జనం రోజు భజన కార్యక్రమం చేసేవారు సంబంధిత దాన్ని అనుకరిస్తూ భక్తి భావంతో మెలుగవలెను. పర్మీషన్ తీసుకొనవలెను.నిమజ్జనం రోజు వారి వారి అనుకూలనుసారం” బావులలో చెఱువులలో కాలువలలో లేదా గోదావరిలో మొదలగు చోట్ల వేసేటప్పుడు పెద్దవారు మాత్రమే ముందుకు వెళ్లి విగ్రహన్ని వేయాలి. ప్రత్యేకంగా ఈత వచ్చిన వారు ఉండవలెను. పోలీస్ వారి సూచనల మేరకు నిమజ్జనం చేయవలను.నిమజ్జనం రోజు కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలు వెల్లడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతీ గణేష్ నీ నిమజ్జనం చేసే రోజు తప్పక పెద్దవాళ్లు ఉండవలెను. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా ఇంటికి చేరుకోవలెను.కొన్ని మారుమూల గ్రామాలలోని ప్రజలు గ్రామ శివారులో గల చెఱువులో లేదా నీటి గుంతలలో గణేష్ నిమజ్జనం చేయాడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాటిలో గతంలోనే ప్రొక్లేన్స్” ద్వారా పెద్ద పెద్దగా మట్టి తీసివేయడం వలన అక్కడ నీరు ఎక్కువగా నిల్వ ఉన్నా కాని కొద్దీగా ఉన్నట్లు కనబడును. కావున ఇటువంటి ప్రదేశాలలో సంబందిత పెద్ద వారు సరియైన జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరానుకూలంగా సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.నిమజ్జనంచేసే సమయంలో ఎవ్వరు కూడా విన్యాసాలు చేయకూడదు. సెల్ఫోన్తో సెల్ఫీలు దిగవద్దు.వినాయక విగ్రహం తీసుకొని వచ్చే రోడ్డులో కానీ వినాయక విగ్రహం తీసుకొని వెళ్లే రూటులో కానీ ఎంత ఎత్తు గలదో అట్టి దారి పొడవున ముందుగానే చూసుకోవాలి. ఎక్కడ ఎలాంటి ప్రమాదము జరగకుండా ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు పాటించవలెను.
  6. ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడు సహకరించవలెను.