Listen to this article

కటిన చర్యలు తీసుకుంటాం.. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్..

జనం న్యూస్, ఆగస్ట్ 21, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )

ప్రజలకు అనువుగా ఉండేందుకు మున్సిపాలిటీ పరిధిలో వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేసుకున్నారని, నాణ్యత ప్రమాణాలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వాటర్ ప్లాంట్ లపై కటిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. బుధవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని జయశ్రీ వాటర్ ప్లాంట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ..మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు నాణ్యమైన తాగు నీరు అందించాలని ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ లోని క్యాన్లు 90రోజులకు ఒకసారి మార్చాలని, నీటిలో ఎంత శాతం క్లోరిన్ కలపాలో కూడా తెలియని షాప్ లోని వర్కర్లను షాప్ లలో ఉంచుతున్నారని, క్యాన్ లో పురుగులు ఉంటున్నాయని కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చి రోగాలను తెచ్చుకుంటున్నామని, ఇటువంటి వాటిపై కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలో 25 వాటర్ ప్లాంట్ లు ఉన్నాయని, వాటిని తనిఖీ చేస్తామని ఆయన అన్నారు. షాప్ లైసెన్స్ ల గడువు ముగిసిన రెన్యువల్ చేసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. కొన్ని ప్లాంట్ లలో క్లోరిన్ కు బదులుగా బ్లీచింగ్ కలుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్ష కాలంలో ప్రజలు ఎల్లప్పుడూ మిషన్ భగీరథ నీటిని కానీ, ప్లాంట్ లో కొన్న నీటిని కానీ కాచి చల్లార్చి తాగాలన్నారు. ప్రజలు తాగే ప్రతి నీటిని కాచి చల్లార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తక్షణమే వాటర్ ప్లాంట్ లైసెన్స్ రెన్యువల్ చేసుకొని వారు చేసుకోవాలని, బి.ఎస్.ఐ. సర్టిఫై ఉన్న క్లోరిన్ నే కలపాలన్నారు. తొందర్లోనే అన్ని షాపులు తనిఖీలు చేస్తామని, ప్రజలకు హాని కలిగించే వాటర్ ప్లాంట్ ను సీజ్ చేస్తామని, షాప్ లోని వర్కర్ లకు కానీ, యజమానులకు కానీ క్లోరిన్ ఎంత మేరకు కలపాలో తెలిసి ఉండాలన్నారు. అనంతరం గణేష్ హోల్ సేల్ షాపును తనకి నిర్వహించారు. అందులో అమ్మే పలు వస్తువుల గడువు కాలం పరిశీలించి, బ్యాన్ అయిన ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించడంపై ఫైన్ వేశారు. పట్టణంలో బ్యాన్ అయిన ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, ప్రజలు జమ్మికుంటను ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ గా తీర్చి దిద్దడంలో సహకరించాలని కమిషనర్ మహమ్మద్ అయాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్ పెక్టర్ లు మహేష్, సదానందం, ఈఈ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది తో పాటు పలువురు పాల్గొన్నారు.