Listen to this article

జనం న్యూస్, ఆగస్టు 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములపర్తి కేంద్రం లో జరిగింది. రిసోర్స్ పర్సన్లు గా రామక్రిష్ణ రెడ్డి, భూపతి రెడ్డి, వ్యవహరించారు. ఇందులో ప్రతీ పాటశాల నుండి ఒక ఉపాధ్యాయుడు, షెర్ప్ డ్వాక్రా మహిళల సంఘాల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ లు, క్లస్టర్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఇంతవరకు మార్కూక్ మండలము లో అన్ని గ్రామాల నుంచి సర్వే ద్వారా 1666 మంది నిరక్షరాస్యలు మరియు 136 మంది విద్యా వాలంటీర్ టీచర్ ను గుర్తించి యాప్ లో నమోదు చేసినారు. పది మందికి ఒక వాలంటీర్ టీచర్ చొప్పున బ్యాచింగ్ చేసి గ్రామంలో సెంటర్లు ఏర్పాటు చేసి సాయంత్రం సమయంలో బోధన చేయాలని మండల విద్యాధికారి మార్కుక్ వెంకట రాములు, తెలిపారు. మండల స్థాయిలో శిక్షణ పొందిన గ్రామ స్థాయిలో శిక్షణ వాలెంటర్ టీచర్ ల కు బోధన మెళుకువల గురించి చెప్పి 100రోజు లలో,200 గంటల సమయము లో ప్రాథమిక అక్షరాస్యత సాధించాలని కోరారు. దీనికి సంబంధించిన లెర్నింగ్ మెటీరియల్ సప్లై చేయబడును. కేంద్రాలు సెప్టెంబర్ 8న అక్షరాస్యత దినోత్సవం రోజు నుండి ప్రారంభం అవుతుంది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ లో బాగంగా డ్రాపౌట్ అయిన విద్యార్థులు, 10వ తరగతి కి,10వ, తరగతి పూర్తి చేసి ఆపిన ఇంటర్మీడియట్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట సెంటర్ లో ఈ నెల 28 వరకు ఫీజు చెల్లించాలని, వీరిని మోటివేట్ చేసి ఫీజు చెల్లించునట్లు చేయాలని సూచించనైనది. బహుళ ప్రచారం కల్పించాలని కోరారు.ఇట్టి కార్యక్రమం లో మార్కూక్ మండలము ఏ పి ఎం యాదగిరి , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములపర్తి ప్రధానోపాధ్యాయులు లతి సైదా, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ల నుండి ప్రధానోపాధ్యాలు, ఉపాధ్యాయులు ,క్లస్టర్ కో ఆర్డినేటర్లు కవిత, నాగరాజు, హరిచంద్ , కనకయ్య, పాల్గొన్నారు.