విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో ఆగస్టు 20న జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నిర్వహించి, దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్.డి.పి.ఎస్., పోక్సో, అట్రాసిటీ, మిస్సింగు, సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాద కేసులను, లాంగ్ పెండింగు కేసులను సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – న్యాయ స్థానాల్లోని ట్రయల్ కేసుల్లో సాక్షులు, మధ్యవర్తులు తమ సాక్ష్యాలను చెప్పే విధంగా వారిని ముందుగా బ్రీఫ్ చేయాలని, న్యాయ స్థానాలను సంబంధిత ఎస్ఐలు, సిఐలు తరుచూ సందర్శిస్తూ, వివిధ కేసుల్లో ప్రాసిక్యూషను జరుగుతున్న తీరును గమనిస్తుందాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. పోక్సో కేసుల్లో బాధితురాలి వయస్సును నిర్ధారించేందుకు పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాల నుండి జారీ చేసిన ధృవ పత్రాలను పొందాలన్నారు. పి.జి.ఆర్.ఎస్. ఫిర్యాదులను తాము సూచించిన అధికారులు మాత్రమే విచారణ చేసి, నివేదికలను ఎస్పీ కార్యాలయాలకు నిర్ధిష్ట సమయంలోగా పంపాలన్నారు. 7సం.లు కంటే ఎక్కువ శిక్షలువడే కేసుల్లో నేర స్థలంను రీజనల్ ఫోరెన్సిక్ అధికారులు సందర్శించి, ఆధారాలను సేకరించే విధంగా చర్యలు చేపట్టాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తు వివరాలను ఈ-సాక్ష్య యాప్లోను, సిసిటిఎన్ఎస్లో ఎప్పటికప్పుడు అప్లోడు చేయాలన్నారు. 7సం.లు కంటే తక్కువ శిక్షలు విధింపబడే కేసుల్లో దర్యాప్తును 60 రోజుల్లోను, 10 సం.లు కంటే ఎక్కువ శిక్షలు విధింపబడే కేసుల్లో 90 రోజుల్లోను దర్యాప్తు పూర్తి చేసి, నిందితులపై అభియోగ పత్రాలు దాఖలు చేయాలన్నారు. పోలీసు స్టేషనుల్లోను, స్టేషను పరిధిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు సక్రమంగా పని చేసే విధంగా చూడాలన్నారు. చర్చిలు, మసీదులు, దేవాలయాలు, ముఖ్య కూడళ్ళులో మరిన్ని సినీ కెమెరాలు ఏర్పాటు చేసి, నేరాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్కూల్స్ మరియు కాలేజ్లో ఈగల్ క్లబ్స్, శక్తి వారియర్స్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. మహిళా విద్యార్ధినులు ఆత్మరక్షణకు అవసరమైన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించే విధంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులును జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రజలు, మహిళలు విద్యార్ధినులకు శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించాలని, వారి మొబైల్స్ లో శక్తి (ఎస్.ఓ.ఎస్) డౌన్లోడు చేసేందుకు ప్రత్యేకంగా మహిళా సంరక్షణ పోలీసులను వినియోగించాలన్నారు. సంబంధిత న్యాయమూర్తులతో మాట్లాడి ఓపెన్ డ్రింకింగు కేసుల్లో కమ్యూనిటీ సర్వీసును నిందితులు చేపట్టే విధంగా శిక్షలు విధించేలా చూడాలన్నారు. స్పెషల్ నైట్ రౌండు విధులు నిర్వహించే పోలీసు అధికారులు రాత్రి వేళల్లో షాపులను త్వరితగతిన క్లోజ్ చేయించాలని, సహేతుకరమైన కారణం లేకుండా పట్టణాల్లో ఎవ్వరూ తిరగకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై టౌన్ న్యూసెన్సు చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రాబోయే లోక్ అదాలత్ ను దృష్టిలో పెట్టుకొని, ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో డిస్పోజ్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గణేష్ మండపాల ఏర్పాటుకు ఆన్లైనులో దరఖాస్తు చేసుకున్న ఉత్సవ కమిటీలకు అనుమతులు మంజూరు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా పెట్టాలని, ఎన్.డి.పి.ఎస్. కేసుల్లోని నిందితులపై ఫైనాన్సియల్ దర్యాప్తు చేపట్టాలని, పశువుల అక్రమ రవాణ, కోడి పందాలు, జూదాలు నిర్వహించకుండా చూడాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్జీపిఎస్, మిస్సింగు, 194 బి.ఎన్.ఎస్. కేసులు, సైబరు నేరాలు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్ఫోర్సుమెంటు కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉండుటకుగల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు దిశా నిర్ధేశం చేసి, సకాలంలో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు వివిధ పోలీసు విధులను సమర్ధవంతంగా నిర్వహించి, గంజాయి, చోరీలు నియంత్రించుటలోను, లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేయుటలోను, దర్యాప్తు కేసులను తగ్గించుటలోను, సిసిటిఎన్ఎస్ కేనుల వివరాలను నకాలంలో అప్లోడ్ చేయుటలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి జి.భవ్యా రెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్. రాఘవులు, మహిళా పిఎస్ డీఎస్పీ ఆర్. గోవిందరావు, డిటిసి డిఎస్పీ ఎం.వీర కుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సిఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


