Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్లు అమ్ముకున్న గజదొంగ అన్యమతస్తుడు, హిందూ మతం పై ద్వేషం పెంచుకొని నిత్యం తిరుమలలో అన్యాయం జరుగుతుందని సాక్షి పత్రిక సాక్షి మీడియాలో కథనాలు వండి వార్చుతున్నారని శ్రీ శ్రీశ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కాండ్రేగుల సత్యనారాయణ ఒక ప్రకటనలో భూమన కరుణాకర్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. కలియుగ ఆరాధ్యదైవం వెంకటేశ్వరుడి సేవలో నిస్వార్ధంగా పనిచేస్తున్న పాలక మండల చైర్మన్ బి ఆర్ నాయుడు పై గజదొంగ కరుణాకర్ రెడ్డి అవాకలు చవాకులు మాట్లాడడం అతను కొడుకు అభినవ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కైంకర్యం చేసి ఎదుటివారిపై నిందల మోపడం మొదటనుంచి వీరికి అలవాటని, అబద్దాలు ప్రచారం చేయడంలో భుమన సిద్ధహస్తుడిని సత్యనారాయణ అన్నారు. భూమన చైర్మన్ గా ఉన్నప్పుడు కొడుకు అభినవరెడ్డి తిరుమలలో దందాలు చేశారని, నాడు గోశాలలో అభినవ రెడ్డి భూమని మేనమామ హరినాధ రెడ్డి, అలాగే వైకుంఠ ఏకాదశి రోజున క్యూ కాంప్లెక్స్ లో జరిగిన తొక్కుసలాట లో భక్తులు చనిపోవడానికి కారణం ఈ అన్యమతస్తుడు డైరెక్షన్ లోనే జరిగిందని, భూమన చైర్మన్ గిరి ఎలాగ పెట్టినప్పుడు సుమారు 1600 నుండి 2000 కోట్లు పనులు కాంట్రాక్టర్లకు అప్పజెప్పి కమిషన్ లో తీసుకున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని వెంచర్ల వేసి దేవుడు సొమ్ముతో రోడ్లు వేసుకున్నారని, వీటన్నిటిపై విచారణ జరుగుతుందని త్వరలో తండ్రీకొడుకులు జైలు ఊసలు లెక్కపెట్టడం ఖాయమని సత్యనారాయణ జోష్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బి. ఆర్.నాయుడు చైర్మన్ గా నియమితులైన తర్వాత వైసిపి అరాచకాలను, అన్యాయాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారని అక్కసుతో, దురుద్దేశంతో, తిరుమల పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వెంకటేశ్వర స్వామి పై పెట్టుకున్న వారు ఎవరు బాగుపడలేదని దానికి జగన్ రెడ్డి ఉదాహరణ అని సత్యనారాయణ అన్నారు.