

గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో అనుమతి పొందాలి.
ఎస్ఐ దుర్గారెడ్డి,
జనం న్యూస్,ఆగస్ట్ 21,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు వినాయక చవితి పండగను భక్తి శ్రద్ధలతో చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని ఎస్ఐ దుర్గారెడ్డి, అన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వినాయక చవితి పండగ భక్తిని చాటాలి.కానీ విషాదాలు జరగకుండా చూసుకోవాలని వినాయక మండప నిర్వహకులకు ఎస్ఐ తెలిపారు.వినాయక చవితి ఊరేగింపులో, శోభాయాత్రలో తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని అన్నారు.వినాయక విగ్రహాలను వీలైనంత చిన్నవిగా తెచ్చుకోవాలని అన్నారు.పరిమితికి మించి పెద్ద విగ్రహాలు తీసుకు వచ్చేటప్పుడు, నిమజ్జన సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు.వినాయక మండపాల డెకరేషన్, సౌండ్ బాక్స్ లా ఏర్పాట్లలో విద్యుత్ తో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా ఆన్ లైన్ లో అనుమతి పొందాలని అన్నారు. నిమజ్జనం సమయంలో మత్తు పదార్థాలు సేవించవద్దని, చెరువులు,కుంటల్లోని లోతట్టు నీటిలోకి వెళ్లకూడదని అన్నారు. వినాయక చవితి మండపాల నిర్వాహకులకు కంగ్టి పోలీస్ శాఖ వారి హెచ్చరిక,