

మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్,
జనం న్యూస్,ఆగస్ట్ 21,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ పరిసరాల గ్రామాలలోని ప్రాథమిక ప్రాథమిక ఉన్నత, పాఠశాలలను గురువారం మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్, ఆకస్మికంగా సందర్శించారు.జంమ్గి బి,జంమ్గి కె,గాంధీనగర్, సాధు తాండా,ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి, పాఠశాల విద్యార్థుల హాజరు నమోదు రిజిస్టర్ను,ఉపాధ్యాయుల ముఖ హాజరు, విద్యార్థుల ముఖ హాజరును పరిశీలించారు.తరగతి గదిలో విద్యార్థులకు బోధించే తీరును పాఠశాలల్లో ఉపయోగిస్తున్న టిఎల్ఎం ను పరిశీలించి,మధ్యాహ్న భోజనం రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా వండి పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, ప్రొద్దున పాఠశాల సమయానికి రావాలని సాయంకాలం నాలుగు గంటల వరకు పాఠశాలల్లో ఉండాలని అన్నారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులఫై,కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఆర్పి తులసీరామ్, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.