Listen to this article

రైతులకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఎరువులు, విత్తనాలని విక్రయించాలి

దుకాణం ముందు స్టాకు నిల్వ, ధరల పట్టిక వివరాలు తప్పనిసరి

రైతులు నానో యూరియా ఉపయోగించుకోవాలి

తహసీల్దార్ చంద్రశేఖర్

జనం న్యూస్ ఆగష్టు 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

మునగాల మండలంలోని మన గ్రోమోర్ సెంటర్ ఎరువుల దుకాణాన్ని స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్, మునగాల మండల వ్యవసాయ అధికారి బి.రాజు, మునగాల ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ తనిఖీ చేయడం జరిగింది.మన గ్రోమోర్ సెంటర్లోని ఎరువుల స్టాక్ రిజిస్టర్ లను,బిల్ బుక్ లను, ప్రస్తుతం ఉన్న యూరియా & ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులతో ఎంఆర్పి ధరల గురించి అడుగగా,యూరియా ను 266 రూపాయలకే ఇస్తున్నారు అని తెలియజేశారు.ఆ తరువాత నానో యూరియా వాడకం, ఉపయోగాలు గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.మునగాల మండలంలో 1120 బాటిల్ల నానో యూరియా అందుబాటులో ఉందని, ప్రస్తుతం కొక్కిరేణి, మునగాల, తాడ్వాయి సహకార సంఘాలలో యూరియా అందుబాటులో ఉంది అని, రైతులు తప్పనిసరిగా యూరియా బస్తాలతో పాటు నానో యూరియా బాటిల్ కూడా కొనుగోలు చేయాలని, పిచికారి చేయటం అలవాటు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ..రైతులకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఎరువులు,విత్తనాలు నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. దుకాణం ముందు స్టాకు నిల్వ, ధరల పట్టిక వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని, యూరియా,డీఏపీ, ఇతర మందులు,విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని అన్నారు.నకిలీ,నిషేధిత విత్తనాలు,ఎరువుల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.