Listen to this article

గురుస్వాములు సంజీవరెడ్డి, నర్ర బిక్షపతి ఆధ్వర్యంలో .

జనం న్యూస్ ఆగస్ట్ 21 సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పట్టణ పరిధిలో శాంతినగర్ కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్తలు,గురు స్వాములు సంజీవరెడ్డి మరియు నర్ర బిక్షపతి ఆధ్వర్యంలో శ్రావణమాసం సందర్భంగా గురువారం ఉదయం 30 మంది జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మరియు రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి లు విచ్చేసి అయ్యప్ప స్వామి దర్శించుకుని సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మందిరంలో అయ్యప్ప భజన, అయ్యప్ప సేవ గురుస్వాములతో కలిసి పూజలను నిర్వహించామనీ, ప్రతి సంవత్సరం లాగానే శ్రావణమాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతలను నిర్వహిస్తామనీ, భక్తులు వారి కుటుంబాలతో కలిసి భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటూ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొంటారనీ వారు అన్నారు. ప్రతి సంవత్సరం భక్తులకు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో వ్రతం చేయించుకోవడానికి సంఖ్య పెరుగుతూ వస్తున్నదనీ వారు అన్నారు. అనంతరం 500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము, ఇక్కడికి వచ్చిన భక్తులకు అయ్యప్ప స్వామి ఎల్లవేళలా వారివెంట ఉంటూ వారిని వారి కుటుంబ సభ్యులను ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు కోరుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు సంజీవరెడ్డి కుటుంబ సభ్యులు, నర్ర బిక్షపతి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు, అయ్యప్ప బ్యాటరీ శంకర్ గురుస్వామి అవంచ గురుస్వామి, మంగలి అంజి గురుస్వామి, పురుషోత్తం గురుస్వామి, కనకరాజు గురుస్వామి, పవన్ పంతులు, అయ్యప్ప భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.