

మద్నూర్ ఆగస్టు 21 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన,శిఖర స్థాపన మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.బీ.సీ కాలనీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కమ్యూనిటీకి పెద్ద పీఠ వేస్తుందని తెలిపారు.జుక్కల్ నియోజకవర్గంలో కూడా ముదిరాజ్ కమ్యూనిటీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని, వారి సమస్యలను పరిష్కరించడమే గాక అన్ని విధాలుగా అండగా ఉంటానని,ముదిరాజ్ లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తానని భరోసా ఇచ్చారు..ముదిరాజ్ సంఘం భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు సాయి పటేల్, చెవుల వార హనుమాన్లు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిలు, మిర్జాపూర్ మందిర్ అధ్యక్షుడు రామ్ పటేల్, సొసైటీ చైర్మన్ శీను పటేల్, మద్దూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కొండ గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

