

జనం న్యూస్ ఆగస్టు 21 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా
చిలిపి చెడు మండలం లో ఆగ్రో సేవా కేంద్రంనీ సందర్శించిన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రైతులకు యూరియా కావాలని అగ్రోస్ యాజమాన్యాన్ని అడగగా ప్రభుత్వం మాకు 15 రోజుల నుంచి సరఫరా చేయడం లేదని ఆగ్రోస్ యాజమాన్యం తెలియజేసింది. యూరియా బస్తాలు లేక రైతులు అల్లాడుతున్నారని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. రైతులకు మద్దతుగా యూరియా కొరతను తీర్చాలని రోడ్డుపై బైఠాయించి రైతులతోపాటు బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..యూరియా కొరుతతో రైతులు సొసైటీల వద్ద ఉదయం 5 గంటల నుండి పడిగాపులు కాస్తుంటే పాలకులు కొరత లేదని చెప్పడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అరిగోస పడుతున్నారన్నారు. సకాలంలో రైతుబంధు అందక ఎరువులు లేక అష్టకష్టాలు పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని అధికారులను సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేయడం జరిగింది.రైతులు ఏ సమయంలో ఏమీ కావాలో అవగాహన లేక ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. అబద్దాల మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. మూడు నెలలు గడిచినా రైతులకు బోనస్ ఇవ్వలదేన్నారు. రైతులకు యూరియా కొరత తీర్చడంతో పాటు బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిలిపిచేడు మండలం చిట్కుల్ చౌరస్తాలో రైతులతోపాటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధర్నా నిర్వహించారు. పోలీసు అధికారులు వచ్చి రైతు ధర్నాను భగ్నం చేయడం జరిగినది. శీలంపల్లి. జగ్గంపేట ఫైజాబాద్ గ్రామాల రోడ్లను అభివృద్ధి చేసి బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి చిలిపిచేడు బి ఆర్ ఎస్ పార్టీ మండలఅధ్యక్షుడు అశోక్ రెడ్డి మాజీ జెడ్పి కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ లక్ష్మణ్ శ్రీకాంత్ రెడ్డి మాజీ మండల యూత్ ప్రెసిడెంట్ అంతిరెడ్డి గారి నరసింహారెడ్డి సంఘ గౌడ్ ఎంసీ విట్టల్ దుర్గారెడ్డి కౌడిపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామా గౌడ్ వివిధ మండలాలకు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు