
అమరావతి: విజయవాడ(Vijayawada)లో ఇవాళ(సోమవారం) మరోసారి లయోలా కాలేజ్ వాకర్స్ (Loyola College Walkers) నిరసన చేపట్టారు. మూడు వేల మందికి పైగా లయోలా వాకర్స్ క్లబ్ అసోసియేషన్‌గా ఉందని.. తమను కాలేజీలోకి అనుమతించాలంటూ వాకర్స్ ఆందోళనకు దిగారు. గత 25 సంవత్సరాలుగా తాము కాలేజ్‌లో వాకింగ్ చేస్తున్నామని.. ఇప్పుడు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. అయితే గతంలో కోవిడ్ సమయంలో వాకర్స్‌ను కాలేజ్‌లో వాకింగ్ చేయకుండా కాలేజ్ యాజమాన్యం నిలిపివేసింది. అప్పటి నుంచి తమకు వాకింగ్ చేయడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రజాప్రతినిధులకు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆందోళనకు దిగారు.