

జనం న్యూస్,ఆగస్టు21,అచ్యుతాపురం:
అచ్యుతాపురం సెజ్ లో గత సంవత్సరం ఇదే రోజు ఎసెన్సియా ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.వారికి మృతికి సంతాపంగా ఈరోజు అచ్యుతాపురం జంక్షన్లో సీఐటీయూ మృతులకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోమినాయుడు మాట్లాడుతూ ఎసెన్సియా ప్రమాదం జరిగి ఏడాది అయిందని, ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందగా 39 మంది తీవ్ర గాయాలు పాలయ్యారని,ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏసేన్సియా ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడినా యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదని,ప్రైవేటు యాజమాన్యాలు లాభాలే పరమావధిగా కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని, ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యాలు కార్మికుల, ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కల్పించి భద్రత ప్రమాణాలు పాటించాలని కోరారు .ఈ కార్యక్రమంలో పోలవరపు దుర్గ,నాగేష్ ,పైడ్రాజు గోవిందు,పైడ్రాజు,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.