

- ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాజీనామా.
★ సన్మానించిన ప్రజా ప్రతినిధులు మండల అధికారులు.
జనం న్యూస్ జనవరి 28 ( అల్లూరి జిల్లా ) అనంతగిరి మండల ఇంజినీరింగ్ అధికారిగా పనిచేస్తున్న వై సాయి విజయ్ మిలటరీ ఈస్టర్న్ కమాండ్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. వారు ప్రస్తుతం చేస్తున్న మండల ఇంజినీరింగ్ ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేశారు. మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్ , ఈస్టర్న్ కమాండ్ ఉద్యోగానికి వెళ్ళుచున్నారు , ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారికి మండల ప్రజపరిషత్ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆధ్వర్యంలో సాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీడీవో కుమార్, పంచాయితీ విస్తరణ అధికారి లాలం సీతయ్య , పంచాయితీ కార్యదర్షులు, ఎంపిడిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.