Listen to this article

జనం.న్యూస్ :21 ఆగస్టు గురువారం:

సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;గ్రామీణ ప్రాంతాల బ్రతుకుచిత్రాను కుంచెద్వార కదిలించి అంతర్జాతీయ ఖ్యాతి గరించిన కీర్తిశేషులు డాక్టర్ కాపు రాజయ్య సేవలు అమోఘమని సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, బస్వ రాజ్ కుమార్, నల్ల అశోక్, కాల్వ రాజయ్య లు అన్నారు. డాక్టర్ కాపు రాజయ్య వర్ధంతి సందర్భంగా బుధవారం ఆగస్టు 20 సిద్దిపేటలోని విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించి, వారు మాట్లాడుతూ బతుకమ్మ, బోనాలు, కులవృత్తులు ఇలా ప్రకృతిలోని ప్రతి అంశాన్ని చిత్రంగా మలిచి పల్లె కళలకుంచెగా డాక్టర్ కాపు రాజయ్య అంతర్జాతీయ ఖ్యాతి గడించారన్నారు. కార్యక్రమంలో మిట్టపల్లి పర్శరాములు, గడ్డం బాలకిషన్, బైరి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.