

నవాబుపేట జనం న్యూస్: నవాబుపేట మండల పరిధిలోనికి చౌడూర్. గ్రామానికి చెందిన ఆకుల సిద్ధప్ప షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ లో కానిస్టేబుల్ గా విధులను నిర్వహిస్తున్నారు ,విధి నిర్వహణలో భాగంగా దొంగలను పట్టుకోవడం, మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం,15వేల రూపాయలు నగదు పోగొట్టుకున్న కుటుంబాలకు అందించడం ,మతిస్థిమితం లేని కుటుంబం ఆర్టీసీ బస్టాండ్ లో తిరుగుతుంటే వాళ్లను గమనించి వాళ్ళ కుటుంబానికి అప్పజెప్పడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం ద్వారా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఆర్ఎం సంతోష్ కుమార్ ఆకుల సిద్ధప్పకు అవార్డు ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డ్యూటీ ఆర్ ఎం ,డిఎం ,ఆర్టీసీ అధికారులు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు