Listen to this article

జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముబేషన్‌కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ.లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.