Listen to this article

జనం న్యూస్ 22- 8- 2025 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి

జోగిపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆవరణలో ఈరోజు ఉదయం ముదిరాజుల కుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ చేపట్టే కార్యక్రమానికి భారీ సంఖ్యలో ముదిరాజ్ లు తీర్థ ప్రసాదాలు స్వీకరించి పూజా కార్యక్రమంలో పాల్గొని పెద్దమ్మ తల్లి కి జై ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ సంఘం కో కన్వీనర్ అల్లాదుర్గం సురేష్ మాట్లాడుతూ జోగిపేట పట్టణానికి పెద్ద చరిత్ర ఉందని ప్రథమాంధ్ర మహాసభ లు నిర్వహించిన ఈ నేల ఈ గడ్డ ఉద్యమానికి ఊపిరిని బిగించిన ఈ గడ్డ ఉద్యమాల పేరు ప్రఖ్యాతలుగాంచిన జోగిపేట పట్టణంలో పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్ర నాయకులు నాదులపురం నారాయణ మాట్లాడుతూ నేను ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన వాడను చరిత్రగలిగినటువంటి జోగిపేటలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించాలని ఎన్నో సందర్భాలలో నేను మన కుల బంధువులకు తెలియజేశాను ఈరోజు ఆ కల నెరవేర పోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ముదిరాజులు ఐక్యతతో ముందుకు వెళ్లాలని అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ లు రాజకీయాలలో రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలోజోగిపేట పట్టణ ముదిరాజ్ అధ్యక్షుడు,పట్లూరి శివశేఖర్,డాకూరి శివశంకర్,అయ్యప్ప నిర్మల,తుపాకుల సునీల్ కుమార్,డిబి కాలయ్య, లక్ష్మీనారాయణ సార్, డాకురి అశోక్, పిట్ల లక్ష్మణ్,చాపల వెంకటేశం,ఉలువల వెంకటేశం, ఎర్రారం సతీష్ నర్రానాగేష్, దుద్యాల శ్రీనివాస్, శ్యాం కుమార్,నాయి కోటి అశోక్, నర్రా భీమ్ రాజ్, అల్లే యాదగిరి,అనిల్, తుపాకుల,శేఖర్ చింతకుంట లక్ష్మణ్ మహేష్,నాగరాజ్, కృష్ణ, తదితర ముదిరాజ్ కుల పెద్దలు మహిళ సోదరీమణులు యువకులు పాల్గొన్నారు