జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 22
స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న సిహెచ్ కోటేశ్వర్ రెడ్డి ఈనెల ఆగస్టు 15న ఉత్తమ సహాయకులుగా అవార్డు పొందిన సందర్భంగా వారిని ఇంచార్జి ఎంపీడీవో బుర్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పూలమాలలతో దుశ్యాలతో ఘనంగా సన్మానించి అనంతరము మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా ఇన్చార్జి ఎంపిడిఓ చంద్రశేఖర రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగి తన విధుల పట్ల సక్రమంగా విధులు నిర్వహించినట్లయితే ఇలాంటి అవకాశాలు ఎవరికైనా దక్కుతా అన్నారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సిహెచ్ కోటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాపై ఇంత ప్రేమ చూపిన కార్యాలయ సిబ్బందికి మరియు పంచాయతీ కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్య క్రమంలో కార్యాలయ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు


