Listen to this article

జనం న్యూస్ జనవరి 27 చిట్యాల మండలం ప్రతినిధి శ్రీనివాస్ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణంతో కట్ట గోని గోపాలు మరియు నాగిరెడ్డి కొమురయ్య లు మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విచ్చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు బి ఆర్ఎస్ పార్టీ మీ కుటుంబాలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు వారి వెంట గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసిలు పిట్ట సురేష్ బాబు చేరాలా సౌభాగ్యం సదానందం మాజీ సర్పంచ్ హజ్రా బేగం శంషుద్దీన్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు ఇజ్జి గిరి ఆనందం గ్రామ నాయకులు కంచర్ల కుమారస్వామి నీరటి నారాయణ జోగు భానుచందర్ ఎండి పాషా మండల ప్రధాన కార్యదర్శి వేరుకొండ రాజేందర్ గ్రామ సోషల్ మీడియా ఇన్చార్జి కూస ప్రశాంత్ మృతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు