Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 22 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల బిజెపి అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత ఇంజరం గ్రామంలో ఐ పోలవరం మండలకార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు శోభాయాత్ర కార్యక్రమం నిమిత్తం మండల ఇంచార్జి గా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ పాల్గొని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వారి జిల్లా పర్యటన జిల్లాల పర్యటన లో భాగంగా ఈ నెల 25 వ తేదీ సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటించనున్నారు. రాష్ట్ర అధ్యక్షులు హోదాలో మొదటి సారి వస్తున్న సందర్బంగా జరిగే చాయ్ పే చర్చ కార్యక్రమం, శోభా యాత్ర లో బిజెపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి అభిమానులు తో పెద్ద ఎత్తున పార్టీ జండా లతో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసి భారతీయ జనతా పార్టీ బలాన్ని చూపించాలని దీనికోసం శక్తి కేంద్ర ప్రముఖ్ లు, బూత్ కన్వీనర్ లు భాద్యత తీసుకొని ఇప్పటినుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని గ్రంధి నానాజీ మాట్లాడారు, ఈ కార్యక్రమం లో బిజెపి ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్లకోట వెంకటరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు రాయపరెడ్డి భైరవమూర్తి బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మండల కమిటీ సభ్యులు శక్తి కేంద్ర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు