

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 27 మండల పరిధిలోని నాచారం ఆరోగ్య ఉప కేంద్రానికి నాచారం యువత ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలను కల్పించారు. గ్రామానికి చెందిన యడ్లూరి బ్రహ్మేశ్వర రావు కుమారుడు చంద్రశేఖర్ ఫ్రిజ్ ను, వక్కంతుల భద్రయ్య కుమారుడు నరేష్ వాటర్ ప్యూరిఫైయర్ ను, వక్కంతుల నాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఆఫీస్ టేబుల్ ను వితరణగా అందజేశారు. నాచారం యూపీఎస్ కు వక్కంతుల నాగార్జున టీవీ ని వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు డాక్టర్ రాములు, మౌనిక, సిహెచ్ఓ శివరాజ్, దుర్గాప్రసాద్, స్వాతి, నిర్మల, లక్ష్మి,గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆరోగ్య ఉప కేంద్రానికి మౌలిక సదుపాయాలు కల్పించిన దాతలకు వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.