

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఒక్కొక్క విద్యార్థికి వెయ్యి రూపాయలు చొప్పున 14 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది, ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ మద్దిరాల. శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రమశిక్షణ మరియు చదువులో ముందంజలో ఉన్న విద్యార్థులకు సహాయం చేయటాన్ని హర్షం వ్యక్తం చేశారు, బ్రిలియంట్ పాఠశాలలో నర్సరీ నుండి ఏడో తరగతి వరకు ఎటువంటి స్కూల్ ఫీజు లేకుండా ఉచిత విద్యను అందిస్తున్నామని చెప్పారు, ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి క్లబ్ అధ్యక్షులు అయితా.వెంకట ప్రసాద్ మాట్లాడుతూ చక్కని క్రమశిక్షణలో ఉన్న విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాదించాలి అని, అందరూ బాగా చదివి స్కూలు పురోభివృద్ధికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పారు, ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కొత్తమాసు పూర్ణచంద్రరావు క్లబ్ ట్రెజరర్ శనగపల్లి వెంకటేశ్వర రావు మరియు క్లబ్ సభ్యులు, స్కూలు ప్రిన్సిపాల్ P. సాయికృష్ణ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా విజయవంతం చేశారు