Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

చిలకలూరిపేట పట్టణంలోని ఈరోజు మున్సిపల్ చైర్మన్ డివిజన్ వన్ శానిటేషన్ విభాగాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన సానిటరీ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది తమ పనిలో ఎదురవుతున్న పలు సమస్యలను, అవసరాలను చైర్మన్ షేక్ రసాని దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, సిబ్బంది చెప్పిన సమస్యలను శాసనసభ్యులు మరియు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పట్టణంలో పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. వారి సంక్షేమం కోసం మున్సిపల్ పాలకవర్గం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమణారావు, మేస్త్రీలుసిబ్బంది ఉన్నారు.