Listen to this article

జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

డిగ్రీ అడ్మిషన్ విషయానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి రాము, సి.హెచ్ వెంకటేష్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనినీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే డిగ్రీ అడ్మిషన్ విషయంలో చాలా ఆలస్యం చేయడం వలన విద్యార్థులు నెలలు తరబడి చదువుకు దూరమయ్యారు. తీరా అడ్మిషన్లు ప్రారంభమైనప్పటికీ సాంకేతిక లోపాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆఫ్లైన్ ద్వారా కూడా అడ్మిషన్లు చేసుకోవచ్చు అని చెప్పినటువంటివి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆన్లైన్లోనే అడ్మిషన్లు చేసింది. ఈనెల 20వ తేదీన ప్రారంభమైనటువంటి అడ్మిషన్లు గత మూడు రోజులుగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ సర్వర్ ప్రొబ్లంతో ఇబ్బంది పడినప్పటికీ చాలామంది విద్యార్థులు ఎంట్రన్స్ ఫీజులు కట్టి ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. కానీ 22వ తేదీ వచ్చేసరికి అప్పటివరకు ఆన్లైన్ జరిగినటువంటి అడ్మిషన్లు అన్నిటిని ఉన్న పలంగా రద్దు చేసింది. ఆ సమాచారం కూడా ఆన్లైన్ చేసుకున్న విద్యార్థులకు ఇంకా అందలేదు. అంతేకాకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎంట్రన్స్ ఫీజులను పెంచింది. గత సంవత్సరం 200 వసూలు చేస్తే ఈ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 200 ,బీసీ విద్యార్థులకు 300 ,ఓసీ విద్యార్థులకు 400 చొప్పున వసూలు చేస్తుంది. అడ్మిషన్లు ఉన్న పలంగా రద్దు అవడం వలన విద్యార్థులు కట్టిన ఫీజుల్ని నష్టపోతున్నారు. కావున యధాతనంగా అడ్మిషన్లు ప్రక్రియను కొనసాగించాలి. లేనియెడల విద్యార్థి కట్టిన ఫీజుకి బాధ్యతగా మూడు రెట్లు అదనంగా ఫీజుని విద్యార్థికి తిరిగి అందించాలి. అదేవిధంగా పెంచిన ఫీజుల్ని తగ్గించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.