Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

పట్టణంలోని 38వ వార్డు నందు గల మాజీ కౌన్సిలర్ రమావతు సాలీబాయి కుమారుడు మహేష్ నాయక్ కు ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం అమృత హోటల్ నందు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లాపట్టాను పొందారు. అతి చిన్న వయస్సులోనే న్యాయవాద వృత్తిని ఎంచుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నామని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం కృషి చేయాలన్నారు. పేదలకు ఉచిత న్యాయ, సహాయ సహకారాలు అందిస్తూ, మంచి గుర్తింపునుతెచ్చుకోవాలని కొనియాడారు. ఎస్టి సామాజిక వర్గానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. గంగమ్మ సుగాలి కాలని (జిడ్డు కాలని)ప్రజలకు మంచి గర్వకారణమని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వి.కోటా నాయక్, బి. బాలకోటి నాయక్ బి. చిన్నా నాయక్, పాలపర్తి.శ్రీనివాసరావు, బి.శ్రీను నాయక్, రమావతు.రామస్వామి నాయక్, బి.అంజి బాబు నాయక్, పుట్టా.వెంకట బుల్లోడు, యం.వెంకటేష్ నాయక్, కొండ్రముట్ల.నాగేశ్వరరావు, చెన్నకేశవుల.రాంబాబు, ఆర్.మోహన్ నాయక్, ఆర్.సిద్ద నాయక్, ఆర్.శ్రవణ్ నాయక్, మేఘావతు.మంత్రు నాయక్, డి.భవాని నాయక్, ఆర్.దుర్గాప్రసాద్,నాయక్,ఆర్.రవి నాయక్,వి.కృష్ణా నాయక్,నేలం.యేసు రాజు,వి.శివుడు నాయక్ తో పాటు పలువురు కాలనీ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.